జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయడంపై విచారణ జరపాలని లేఖ రాశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.
వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. కాగా ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారన్న నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. నా ఫోన్ 3 నెలల నుంచి ట్రాప్ చేస్తున్నారని ఆగ్రహించారు. ఫోన్ ట్రాప్ చేస్తున్న విషయం నాకు ముందు నుంచి తెలుసు, రహస్యాలు మాట్లాడుకునేందుకు వేరే ఫోన్ ఉందని వెల్లడించారు. నాకు 12 సిమ్‌లు ఉన్నాయన్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ని మీ పెగాసస్ రికార్డు చేయలేదని పేర్కొన్నారు.