పోలవరం ముంపు గ్రామాల్లో కష్టాల్లో ఉన్న వారి అందరికీ అత్యవసర అవసరాల కోసం రెండు వేల రూపాయలు నగదు, ఇతర నిత్యావసర వస్తువులు, కూరగాయలు కూడా అందజేశామని తెలిపారు కోటగిరి శ్రీధర్. రాజకీయాలకు అతీతంగా బాధితులందరికీ తక్షణ సహాయం లభించింది… ముఖ్యమంత్రి నేరుగా బాధితులను కలుసుకున్నారన్నారు.
.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటన వల్ల వరద బాధితులకు భరోసా లభించింది… వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి 10 వేల రూపాయల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని స్పష్టం చేశారు.
ఏలేరు పాడు లో వరదలు సర్వసాధారణం అన్నారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఏలేరుపాడు లో పర్యటించలేదు…తొలిసారిగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారన్నారు. ముంపు ప్రాంతాల్లో మహిళలను, వృధ్దులను స్వయంగా కలుపుకుని ముఖ్యమంత్రి ధైర్యం కలిపించారన్నారు.