వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పార్టీ నేతలు..అంతరంగికులతో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీలో జరుగుతున్న అవమానాలు.. అనుమానాలను భరించలేనని ఇందులో మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నన్ను విశ్వసించండి..ప్రజల కోసమే పలు సమావేశాల్లో పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడానన్నారు. ఫోన్ టాప్ చేస్తున్నారని నా వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వాటిని బయట పెట్టలేను పెడితే పలువురికి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. మీరు నన్ను విశ్వసించండి..మీకు అండగా ఉంటానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.