మరి తాను రాజకీయంగా వెనుకబడిపోతున్నానని అనుకుంటున్నారో లేక…మీడియాలో కనిపించకపోతే ప్రజలు తనని గుర్తు పట్టరు అనుకుంటున్నారో తెలియదు గాని…ఈ మధ్య కౌశిక్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ ని తిట్టే కార్యక్రమం చేస్తున్నారు. మామూలుగా కౌశిక్ రెడ్డి అంటే హుజూరాబాద్ ఉపఎన్నికల వరకు ఎవరికి పెద్ద ఐడియా లేదు. కానీ ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో ఉంటూనే…టీఆర్ఎస్ నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. దీంతో కాంగ్రెస్…కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది..ఈ క్రమంలో కౌశిక్…టీఆర్ఎస్ లోకి వచ్చారు.
ఈ క్రమంలో ఈటల స్ట్రాటజీలకు ఎలా బదులు చెప్పాలో తెలియక…కౌశిక్ రెడ్డి దమ్ముంటే హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని..సమయం సందర్భం ల సవాళ్ళు విసురుతున్నారు. ఈటల అంటే ఏంటో హుజూరాబాద్ ప్రజలకు తెలుసు…కానీ ఈటల…గజ్వేల్ కు వెళుతూ..హుజూరాబాద్ ప్రజలని మోసం చేస్తున్నారని కౌశిక్ నిరుపయోగమైన విమర్శలు చేస్తున్నారు. అలాగే ఆగష్టు 5న హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని, రాలేదంటే ఆయన అభివృద్ధి చేయనట్లు ఒప్పుకున్నట్లే అని కౌశిక్ అంటున్నారు.