కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా టీకాల ధరలను రూ. 275 ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఔషధ నియంత్రణ సంస్థ నుంచి సాధారణ అనుమతి పొందిన తర్వాత ఈ మేరకు ధర నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనికి 150 రూపాయల సేవా రుసుం అదనమని పేర్కొన్నాయి.
ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులలో.. ఇతర స్థలాల్లో కొవాగ్జిన్ సింగల్ డోస్ ధర సర్వీస్ టాక్స్ తో కలిపి 1200 రూపాయలు కాగా కొవిషీల్డ్ ధర రూ. 780 గా ఉంది. గత సంవత్సరం జనవరి 3 వ తేదీన అత్యవసర పరిస్థితు ల్లో వాడేందుకు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ ఈ నెల 9వ తేదీన ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఈ రెండు సంస్థలు సాధారణ అనుమతి కోసం అవసరమైన సమాచారం సమర్పించాయి.