కుత్బుల్లాపూర్‌పై వివేకానంద పట్టు..హ్యాట్రిక్ ఫిక్స్?

-

తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏపీ ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉన్న స్థానాల్లో కుత్బుల్లాపూర్ ఒకటి. ఈ నియోజకవర్గంలో ఏపీ నుంచి సెటిల్ అయిన వారే ఎక్కువ. వారే ఇక్కడ గెలుపోటములని శాసిస్తూ ఉంటారు. ఇక గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు కే‌పి వివేకానందని గెలిపిస్తూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వివేకా గెలిస్తే..2018లో బి‌ఆర్‌ఎస్ నుంచి గెలిచారు.

ఇప్పుడు మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి వివేకా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో వివేకా గెలుపు అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశం ఒకసారి పరిశీలిస్తే..ప్రస్తుతానికి ఇక్కడ వివేకాకు పట్టు ఎక్కువ ఉంది. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం, అభివృద్ధి చేయడం, సమస్యలని పరిష్కరించడంలో ముందున్నారు. దీంట్ కుత్బుల్లాపూర్‌లో వివేకా బలం తగ్గినట్లు ఏమి కనిపించడం లేదు. పై పెచ్చు ఇక్కడ కాంగ్రెస్ బలం తగ్గినట్లు కనిపిస్తుంది.

 

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కూన శ్రీశైలం గౌడ్..బీజేపీలోకి వెళ్ళిపోయారు. వ్యక్తిగతంగా కూనకు కాస్త ఇమేజ్ ఉంది..కానీ కుత్బుల్లాపూర్‌లో బి‌జే‌పికి అనుకున్నంత బలం లేదు. అటు కాంగ్రెస్ పార్టీలో కోలన్ హన్మంత్ రెడ్డి..ఈయన కూడా స్ట్రాంగ్ లీడర్..కానీ గతంతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్ బలం తగ్గినట్లే కనిపిస్తోంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీకి కాస్త ఓటింగ్ ఉంది..గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేసేవారు..వివేకాకు సపోర్ట్ చేశారు.

అయితే ఈ సారి టీడీపీ పోటీకి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి గెలుపు అవకాశాలు లేవు గాని, కొన్ని ఓట్లు చీల్చే ఛాన్స్ ఉంది. అటు పవన్ అభిమానులు కూడా ఉన్నారు. దీని బట్టి చూస్తే టీడీపీ-జనసేన గాని బి‌జే‌పికి సపోర్ట్ చేస్తే..ఆ పార్టీకి కాస్త ప్లస్ అవుతుంది..లేదంటే బి‌జే‌పికి నష్టమే. ఓవరాల్ గా చూసుకుంటే కుత్బుల్లాపూర్‌లో వివేకాకు హ్యాట్రిక్ ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఎన్నికల సమయంలో పరిస్తితి ఎలా మారుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version