కృష్ణమ్మ ఉగ్రరూపం…!

-

ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ వరదనీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉదృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 5గేట్లు 10 అడుగులు ఎత్తి నీటిని దిగువన నాగర్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు అదికారులు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో లక్షా 23వేల 258 క్యూసెక్కులు ఉండగా…ఔట్ ఫ్లో లక్షా 70 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 884.50 అడుగుల నీరుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను… ప్రస్తుత నీటి 212.9198 టీఎంసీలుగా ఉంది.

మరోవైపు నాగార్జునసాగర్ నుంచి భారీగా వరదను కిందకు వదులుతుండడంతో..పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లు 2 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా… ప్రస్తుతం నీటి నిల్వ 45.107 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను.. ప్రస్తుతం 174.571 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో, అవుట్ ప్లో లక్షా 17వేల క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద కాస్త తగ్గుముఖం పట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version