Krunal Pandya : తండ్రయిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌

-

టీమిండియా ఆల్‌ రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు ప్రమోషన్‌ వచ్చింది. కృనాల్‌ భార్య పంఖురి శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కృనాల్‌ పాండ్య తాజాగా తన సోషల్‌ మీడియా వేదిక గా ప్రకటించారు. భార్య పంఖురి చేతిలో ఒదిగిన బిడ్డనను ముద్దాడుతూ దిగిన ఫోటోనను కృనాల్‌ ట్విట్టర్‌ లో షేర్‌ చేశాడు.

కవిర్‌ కృనాల్‌ పాండ్యా అంటూ ఫోటోకు క్యాప్షన్‌ ను కూడా జోడించాడు. ఈ విషయం తెలుసుకున్న సన్నిహితులు, సహచరలు కృనాల్‌ పాండ్యకు విషేష్‌ చెబుతున్నారు. ఈ పోస్ట్‌ షేర్‌ చేసిన కొద్ది నిమిషాలకే వైరల్‌ అయింది. దీంతో అభిమానులు కూడా కృనాల్‌ ను శుభాకాంక్షలతో ముంచెతున్నారు. కృనాల్‌ పాండ్యా 2017 లో ప్రముఖ మోడల్‌ పంఖురి శర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version