పదేళ్లు సంతోషంగా ఉన్న హైదరాబాద్ సమస్యలకు కేరాఫ్ గా మారింది : కేటీఆర్

-

హైదరాబాద్ వాసుల కష్టాలు తీర్చేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు కేటీఆర్. రాష్ట్రానికి ఎకనామిక్ ఇంజన్ అయినా హైదరాబాద్ ఇమేజీ కాంగ్రెస్ పాలనలో దారుణంగా దెబ్బతిన్నదన్న కేటీఆర్, ఇది కేవలం హైదరాబాద్ కే కాకుండా యావత్ రాష్ట్రానికి మంచిది కాదన్నారు. పదేళ్లపాటు దేశంలోనే మోస్ట్ లవబుల్ సిటీ గా, లివెబుల్ సిటీగా అనేక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ర్యాంకింగ్ లో అగ్రభాగాన నిలిచిన హైదరాబాద్ గాడితప్పిన పాలన కారణంగా నేడు విలవిలలాడుతోందన్నారు. తెలంగాణ గ్రోత్ ఇంజన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.

గ్రామసభలు, వార్డు సభల పేరిట మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్లు ఇవ్వాలని, లేకపోతే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ కు వెన్నుముక్కైన హైదరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారుకు నగర ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version