వైసీపీ హయంలో కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్డారు : కోటంరెడ్డి

-

నెల్లూరు రూరల్ పరిధిలోని వివిధ డివిజన్ లలో అభివృద్ధి పనులపై నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక కామెంట్స్ చేసారు. రోడ్డు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు వైసీపీ హయంలో ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని పేర్కొన్నారు.

కాబట్టి బిల్లులు వేగంగా చేసి.. అభివృద్ధికి సహకరించాలి. ఎల్ అండ్ టీ సంస్థకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నా భూగర్భ డ్రైనేజ్ పనులు మాత్రం వేగంగా సాగడం లేదు. మెగా సంస్థ కూడా తాగు నీటి ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తి చేయాలి. నెల్లూరు గ్రామీణ వార్డుల్లో ఫాగింగ్ సరిగా చేయడం లేదు. అందులో కలిపే కెమికల్ ను తగిన మోతాదులో వాడటం లేదు. దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ గోడౌన్ పెట్టారు. అయినా ఉపయోగం లేదు. నాకు అప్పగిస్తే నీళ్లు నిలబడిన ప్రాంతాల్లో వాటిని వేయిస్తాను. దోమలుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దోమలపై దండ యాత్ర అనే కార్యక్రమాన్ని కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రజలు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో కలిసి చేద్దాం అని కోటంరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version