దేశంలోని నగరాలు హైదరాబాద్ కు పోటీ రాలేవు : కేటీఆర్

-

హైటెక్‌ సిటీలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం రెండు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ష్యూరిఫై ల్యాబ్స్‌ టెక్నాలజీ, కొలియర్‌ల నూతన కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆఫీస్‌ స్పేస్‌ లీజు విషయంలో హైదరాబాద్‌ నగరం బెంగుళూరును దాటిపోయిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌కు భారతీయ నగరాలు పోటీకానేకాదని, హాంకాంగ్‌, సింగపూర్‌ వంటి ప్రపంచస్థాయి నగరాలతోనే పోటీ అన్నారు మంత్రి కేటీఆర్.

మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణ సృష్టి, వ్యాపార అనుకూల విధానాలను నిరంతరం కొనసాగించడం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా.. హైదరాబాద్‌లో 2012-13లో 2 మిలియన్ల చదరపు అడుగుల పైచిలుకు కమర్షియల్‌ లీజ్‌ స్పేస్‌ ఉందని, గత ఏడాది 11 మిలియన్‌ చదరపు అడుగుల లీజ్‌ స్పేస్‌కు చేరుకుందని తెలిపారు. దీన్నిబట్టి హైదరాబాద్‌ ఎంత వేగంగా, ఎంత బలంగా అభివృద్ధివైపు దూసుకుపోతున్నదో అర్థం చేసుకోవచ్చన్నారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version