ఇటీవలే హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో నగర మొత్తం పెద్ద పెద్ద చెరువును తలపించిన విషయం తెలిసిందే. జనావాసాల్లోకి నీరు రావడంతో జనజీవనం స్తంభించిపోయి నరకం అనుభవించారు నగరవాసులు. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి అధికారులు అందరూ అప్రమత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల జిహెచ్ఎంసి అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో వరదలు వస్తే చేపట్టాల్సిన ఆ సహాయక చర్యలపై అధికారులందరికీ దిశానిర్దేశం చేశారు. ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు అంటూ హెచ్చరించారు మంత్రి కేటీఆర్. మళ్లీ వర్షం వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో నగర వాసులు అందరూ భయాందోళనలో మునిగిపోతున్నారు.