కోనేరు కృష్ణ‌పై కేటీఆర్ ఫైర్‌.. ఫారెస్ట్ ఆఫీస‌ర్‌పై దాడి క్రూర‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణ‌న‌..

-

విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఫారెస్ట్ ఆఫీస‌ర్‌పై దాడి చేసిన కోనేరు కృష్ణ క్రూర‌మైన ప్ర‌వ‌ర్త‌న‌ను తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని, అత‌న్ని అరెస్టు చేస్తామ‌ని, ఇప్ప‌టికే కేసు న‌మోదైంద‌ని, భూ చ‌ట్టానికి ఎవ‌రూ అతీతం కాద‌ని.. కేటీఆర్ ఘాటుగానే స్పందించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాల గ్రామంలో అట‌వీశాఖ భూముల్లో మొక్క‌ల‌ను నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిపై గ్రామ‌స్థులు నిన్న ఉద‌యం విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసిన విష‌యం విదితమే. అట‌వీశాఖ సిబ్బందిపై స్థానిక ప్ర‌జాప్ర‌తినిధితో స‌హా 50 మంది వ‌ర‌కు గ్రామ‌స్థులు క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అనిత‌పై దాడి చేసి ఆమె త‌ల‌పై క‌ర్ర‌ల‌తో కొట్టారు. దీంతో ఆమె ప్ర‌స్తుతం గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది.

అయితే ఈ ఘ‌ట‌నపై తెరాస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. స‌ద‌రు టీఆర్ఎస్ నేత కోనేరు కృష్ణ‌పై కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోనేరు కృష్ణ ప్ర‌వ‌ర్త‌నను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కాద‌ని, కృష్ణ‌ను అరెస్టు చేస్తామ‌ని చెప్పారు. ఈ మేర‌కు కేటీఆర్ నిన్న సాయంత్రం ట్వీట్ చేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఫారెస్ట్ ఆఫీస‌ర్‌పై దాడి చేసిన కోనేరు కృష్ణ క్రూర‌మైన ప్ర‌వ‌ర్త‌న‌ను తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని, అత‌న్ని అరెస్టు చేస్తామ‌ని, ఇప్ప‌టికే కేసు న‌మోదైంద‌ని, భూ చ‌ట్టానికి ఎవ‌రూ అతీతం కాద‌ని.. కేటీఆర్ ఘాటుగానే స్పందించారు.

కాగా కృష్ణ‌తో స‌హా 12 మందిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే వీడియోలో దాడి చేసిన‌ట్లు స్పష్టంగా ఉన్న‌ప్ప‌టికీ కృష్ణ తాను ఆ ప‌ని చేయ‌లేద‌ని బుకాయించే య‌త్నం చేస్తున్నారు. తాను అనిత‌పై దాడి చేయ‌లేద‌ని చెబుతూనే మ‌రోవైపు గ్రామ‌స్థుల‌పై ఫారెస్ట్ అధికారుల జులుంకు నిర‌స‌న‌గా త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని తెలిపారు. ఈ మేర‌కు కృష్ణ ఆ జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఇప్ప‌టికే త‌న రాజీనామా లేఖ‌ను పంపించారు. మ‌రి ముందు ముందు ఈ విష‌యం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version