కొద్దిరోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి అసంతృప్తిగా ఉందని ఇదే పరిస్థితి రాష్ట్రంలో కనుక కొనసాగినట్లయితే ఆరు నెలల్లోగా ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రైతుబంధు రుణమాఫీ నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు ఇవ్వట్లేదని అడిగారు బిఆర్ఎస్ పార్టీకి గ్రామం నుండి రాష్ట్రం వరకు కూడా పెద్ద ఎత్తున అన్ని స్థాయిలో ప్రాతినిధ్యం ఉందని అన్నారు.
అయితే ఇంత బలమైన పార్టీ మళ్ళీ గెలవడం పెద్ద కష్టం కాదని కేటీఆర్ అన్నారు మహబూబ్నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సంఖ్య చూస్తే 420 ఉన్నాయి 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలి అని అన్నారు. రైతులకి 10000 కాదు 15000 ఇస్తా అన్నారు 2000 పెన్షన్ ని నాలుగు వేలు చేస్తా అన్నారు అని అన్నారు