హుజూరాబాద్‌లోనూ బీఆర్ఎస్ గెలుస్తుంది : కేటీఆర్

-

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. దీంతో ఆయా పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ వడివడిగా బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కమ్రంలోనే నేడు కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు గతంలో వలె 88 సీట్లు రాకపోవచ్చునని, కానీ హుజూరాబాద్‌లోనూ తామే గెలుస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేస్తారన్నారు.

తాను గ్రేటర్ హైదరాబాద్, సిరిసిల్ల, కామారెడ్డిలలో ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. తమ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, పెన్షనర్లకు పెద్ద పీట వేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ స్వతంత్రంగానే పని చేస్తుందని భావిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన అధికారుల బదలీలను సాధారణ బదలీలుగా చూస్తామని చెప్పారు. తాను సిరిసిల్లలో ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేయవద్దని నిర్ణయించానన్నారు.

కాంగ్రెస్ 2004, 2009 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేదన్నారు. ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఈటల గజ్వేల్‌తో పాటు మరో యాభై చోట్ల పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా, రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ ఇక్కడకు వచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు నలభై చోట్ల అభ్యర్థులే లేరన్నారు. అలాంటి కాంగ్రెస్ 70 సీట్లు గెలుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version