అసెంబ్లీ ఎన్నికల్లో ఈవియెం మతలబు అన్నారు, మా దమ్ము చూపించాం…!

-

తెలంగాణకు టీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని తెలంగాణా ప్రజలు భావించే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించారని తెలంగాణా మంత్రి కేటిఆర్ అన్నారు. కార్పొరేటర్లు, మేయర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా విపక్షం 9 నెలలు అడ్డుకుందని కేటిఆర్ ఆరోపించారు. బండారం బయటపడుతుందనే ఎన్నికలు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.

సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా తాము  ముందుకి వెళ్తున్నామని కేటిఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెరాస సిద్దంగా ఉందని కేటిఆర్ అన్నారు. కెసిఆర్ నాయకత్వానికి ఎంత మద్దతు ఉందో ఈ ఎన్నికలు నిరూపించాయని కేటిఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలిస్తే ఈవీఎం మతలబు అన్నారని కేటిఆర్ గుర్తు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస గెలిస్తే న్యాయవస్థ లేదని కాంగ్రెస్ అంటుందని ఆయన అన్నారు.

ఎన్నికల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని కాంగ్రెస్ అంటుందని, పంచాయితి ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్ లు గెలుచుకున్నా ఇది విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారని కేటిఆర్ అన్నారు. కాంగ్రెస్ ని ఇక చాలని ప్రజలు అంటున్నారని కేటిఆర్ ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా ఉత్తమ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసారు కేటిఆర్. 120 మున్సిపాలిటీలు, 10 కార్పోరేషన్లు గెలుచుకున్న ఘనత తెరాసది అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version