ఉత్తమ్ పై కేటీఆర్ ఫైర్ ట్వీట్

-

తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ ని ఉద్దేశిస్తూ..చేసిన కామెంట్స్ పై కేటీఆర్ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం .. అమెరికాలో అంట్లు తోమిన కేటీఆర్ మాకు రాజకీయాలు నేర్పాల్సిన అవసరం లేదంటూ ఉత్తమ్ చేసిన విమర్శలకు స్పందిస్తూ…

‘అమెరికాలో ఉన్న సగటు భారతీయుడిలా నా ఇంట్లో  అంట్లు నేను తోముకున్నాను… ఉద్యోగం చేసి సంపాదించిన సొమ్ముతో గౌరవంగా బతికాను దీనికి నేను గర్వపడుతున్నా… మీ పప్పూ (రాహుల్ గాంధీ)లా తానేమీ ప్రజా ధనాన్ని దోచేయలేదు.. అలాగే దోచుకున్న ప్రజా ధనాన్ని మీలా కారుతో సహా కాల్చేయలేదని’ తన దైశ శైలిలో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version