జిహెచ్ఎంసి ఎన్నికలు : హైదరాబాద్ కి ట్రంప్..!

-

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ అధికార టీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. బిజెపి చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు టిఆర్ఎస్ ముఖ్య నేతలు. ఇక ఇటీవలే బిజెపి నేతల వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలకు స్థానిక అంశాలపై మాట్లాడే ఉద్దేశం లేదని అందుకే పాతకాలపు వ్యవహారాలను తెరమీదికి తెస్తున్నారు అంటూ విమర్శించారు.

బీజేపీ నేతలు తెలంగాణలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించకుండా బార్ అక్బర్ గురించి ప్రస్తావిస్తున్నారని.. వాళ్లు ఏమైనా హైదరాబాద్ ఓటర్ల అంటూ ప్రశ్నించారు. ఊరికే వారి పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారో అన్నది కూడా ఎంత ఆలోచించినా తనకు కూడా అర్థం కావడం లేదని.. బిజెపి నేతలు ఇది గల్లీ ఎలక్షన్ అన్న విషయాన్ని మర్చిపోయారు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే ఢిల్లీ స్థాయి నాయకులు కూడా జీహెచ్ఎంసీ ఎన్నిక లో కోసం వస్తున్నారని ఇక.. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ బిజెపి నేతల దోస్త్ కాబట్టి ఆయన కూడా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version