కిషన్ రెడ్డికి తప్పు ఒప్పుకునే దమ్ము లేదు : కేటీఆర్ ట్వీట్

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఓ సోదరుడిగా కిషన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తానంటూనే ఘాటుగా విమర్శలు కురిపించారు. కిషన్ రెడ్డికి తప్పును అంగీకరించే దమ్ము లేదంటూ మండిపడ్డారు.

మెడికల్ కళాశాలల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు కేంద్రం 9 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని కేటీఆర్ అన్నారు.  ‘‘ఓ సోదరుడిగా కిషన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తా. కానీ అసత్యాలు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. అబద్ధాలు మాట్లాడే కిషన్ రెడ్డికి తన తప్పును అంగీకరించే ధైర్యం కూడా లేదు’’ అని కేటీఆర్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version