TSPSC పేపర్ లీకేజ్ పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చాం.. సీఎం ఆదేశాలతో సమీక్ష నిర్వహించామని వివరించారు మంత్రి కేటీఆర్. ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలని సీఎం తెలిపారన్నారు మంత్రి కేటీఆర్.
అదే సమయంలో…. ప్రతి పక్షాలను ఏకీ పారేశారు. TSPSC లో లీకైతే..IT మినిస్టర్ కు ఏం సంబంధం అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ కంప్యూటర్ లీకైనా.. ఐటీ శాఖ మంత్రిదా బాధ్యత అని నిలదీశారు. నిరుద్యోగ యువత ఆందోళన చెందవద్దు.. వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపారు. రాజకీయ నిరుద్యోగులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు.. మాకు ఒక అనుమానం ఉందన్నారు. నిందితుడు రాజశేఖర్ బీజేపీ క్రియాశీలక కార్యకర్త అని ప్రకటించారు మంత్రి కేటీఆర్.