రాజకీయాల్లోకి చిన్నారులను లాగవద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు తెరాస నేతలు, శ్రేణులకు సూచించారు. టీఎస్టీఎస్ ఛైర్మన్ జగన్మోహన్‌రావు చేసిన ఓ ట్వీట్ నేపథ్యంలో ఆయన సొంతపార్టీ నేతలకు సూచనలు చేశారు.
రాజకీయ యుద్ధాల్లోకి చిన్నారులను తీసుకురావద్దని కేటీఆర్ కోరారు. అటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని హితవు పలికారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, పనితీరు ఆధారంగానే ఉండాలని కేటీఆర్ సూచించారు. రాజకీయ ప్రత్యర్థుల పిల్లల ప్రస్తావన తీసుకురావద్దని పార్టీ నేతలు, సోషల్ మీడియా వారియర్స్‌కు సూచించారు.
పసిపిల్లల మనుస్సును కుట్రలు, కుతంత్రాలతో మలినం చేయొద్దని కేటీఆర్ కోరారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌లో వారినీ భాగం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయపరంగా ఏదున్న పార్టీలు, నేతలు ప్రజాక్షేత్రంలోనే చూసుకుందామన్నారు. ఈ యుద్ధంలోకి పిల్లలను తీసుకురావడం చాలా పెద్ద పొరపాటని చెప్పారు.