అమిత్‌ షా.. అల్లూరి వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు..

-

జూన్‌ 2 తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఢిల్లీలో బీజేపీ నేతలు నిర్వహించారు. అయితే ఈ ఆవిర్భవ వేడుకలకు హజరైన అమిత్‌ షా మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు తెలంగాణ కోసం పోరాటం చేసినట్లు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఆవిర్భవ వేడుకల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల్లో అల్లూరి ఫోటోను కూడా చేర్చారు. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీపై ట్విట్టర్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

గురువారం దిల్లీలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్‌షా ఫోటోపై స్పందించారు. అల్లూరి సీతారామరాజు ఫొటోను తిలకిస్తున్న అమిత్‌షా… వాట్సాప్‌ యూనివర్సిటీలో కోచింగ్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ అని సెటైర్ వేశారు కేటీఆర్. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని పార్టీ బీజేపీ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అబ‌ద్ధాలు, జుమ్లానే వారి డబుల్ ఇంజిన్ అని ఆరోపించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version