కొత్త రూట్లో హస్తం..రేవంత్ సైడ్ అయినట్లేనా?

-

తెలంగాణలో ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బాగా కష్టపడుతుందనే చెప్పాలి…ఇప్పటికే రెండు సార్లు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది..ఈ సారి కూడా అధికారం దక్కకపోతే..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి…పార్టీ పరిస్తితి దిగజారిపోకుండా ఉండాలంటే…ఈ సారి మాత్రం తప్పనిసరిగా అధికారం దక్కించుకోవాలి. అయితే బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని, బలపడుతున్న బీజేపీని ఢీకొట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద టాస్క్ అయిపోయింది.

అయితే బలమైన క్యాడర్ ఉండటం, క్షేత్ర స్థాయిలో బలం ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్…కానీ పార్టీలో ఆధిపత్య పోరు ఉండటం మైనస్..ఈ ఆధిపత్య పోరు తగ్గించుకుని నేతలంతా కలిసి కష్టపడితే కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ లో ఆ పరిస్తితి కనిపించడం లేదు..ఎవరికి వారు గ్రూపు రాజకీయం చేస్తున్నారు. టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి…పార్టీలో ఉన్న సీనియర్లని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు..సీనియర్లని సైలెంట్ గా సైడ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఇదే సమయంలో సీనియర్లు సైతం ఏకమై రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారు…ఆ దిశగానే వారు రాజకీయం నడిపిస్తున్నారు…తాజాగా కూడా నవసంకల్ప మేథోమధన శిబిరంలో సీనియర్లు అంతా సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు.. రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని, గ్రామ సర్పంచ్‌ స్థాయి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వరకు కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచి పార్టీ ఫిరాయిస్తే.. వారిని ఇకపై పార్టీలో చేర్చుకోరాదన్న తీర్మానం చేసుకున్నారు.

అలాగే 6 నెలల ముందుగానే అభ్యర్థులని ప్రకటించాలని, మూడు నెలల ముందే పార్టీ మేనిఫెస్టో ప్రకటించాలని డిసైడ్ అయ్యారు..ఇవన్నీ పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండానే సీనియర్లు అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అవసరాన్ని బట్టి పొత్తు ఉంటే బెటర్ అనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉందని చెప్పొచ్చు…అలాగే జంపింగ్ నేతలని మళ్ళీ పార్టీలో చేర్చుకునే ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. కానీ వాటికి సీనియర్లు చెక్ పెట్టారు..మొత్తానికి పార్టీలో రేవంత్ పెత్తనానికి సీనియర్లు చెక్ పెట్టేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version