హుజురాబాద్ ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ లోకి ఈటల రాజేందర్ వెళతారని… ఈటల రాజేందర్ ను పార్టీ లోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందని ఆరోపణలు చేశారు కేటీఆర్. ఈటల రాజేందర్ ఎవరిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని… ఈటల రాజేందర్ తన బాధ ప్రపంచ బాధ అనుకుంటున్నారని చురకలు అంటించారు. జానారెడ్డి కంటే పెద్ద నాయకుడా ఈటలా ? బీజేపీని ఈటల ఎందుకు ఓన్ చేసుకోవడం లేదని ప్రశ్నించారు.
బిజెపి తెచ్చినవి నల్ల చట్టాలు అన్నారు ఈటల…ఇప్పుడు అవి తెల్ల చట్టాలు అయ్యాయా ? అని నిలదీశారు. ఈటల ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదని… ప్రభుత్వంలో ఉంటూ ఈటల అడ్డంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. కరీంనగర్ ,నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ , బిజెపి కలసి పనిచేసినట్టు … హుజురాబాద్ లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపించారు కేటీఆర్. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి ని నిలబెట్టి…బిజెపికి సహకరిస్తుందని… హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎక్కడుందని ప్రశ్నించారు కేటీఆర్. హుజురాబాద్ లో వంద శాతం టిఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.