హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ గెలుపు కోసం మంత్రి హరీష్ రావు ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హుజూరాబాద్‌లో పార్టీని గెలిపించి తన మామ కేసిఆర్ కళ్ళల్లో ఆనందం చూడాలని హరీష్ తాపత్రయ పడుతున్నారు. హరీష్ తాపత్రయంలో తప్పు లేదు. కానీ హరీష్ తాపత్రయం పరోక్షంగా ఈటలకు మేలు చేసేలా ఉంది. అసలు హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ని గెలిపించడం కోసం కాలుకు బలపం కట్టుకుని మరీ హరీష్ పనిచేస్తున్నారు. పాపం సరిగా సమయానికి తిండి తినడం, నిద్రపోవడం చేస్తున్నారో లేదో తెలియదు గానీ, కారు గుర్తుకు ఓటు వేయాలని మాత్రం తెగ తిరుగుతున్నారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని వెంటబెట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. సరే పార్టీ గెలుపు కోసం తిరగడంలో తప్పు లేదు. ఇదే క్రమంలో హరీష్ రాజకీయంగా చేస్తున్నారు. ఈటలని ఓడించడానికి అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తున్నారో. ఇప్పటికే ఎన్ని రకాలుగా రాజకీయం చేశారో తెలిసిందే. అయితే ఇప్పుడు ఓట్లు రాబట్టడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడకక్కడ ఓటర్లని ఆకట్టుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఓటు వేస్తే పథకాలు ఇస్తామని, ఓట్లు వేస్తే ఊరుని బాగు చేస్తామని, పైగా దత్తత కూడా తీసుకుని అభివృద్ధి చేస్తామని మాట్లాడుతున్నారు. అలాగే రాజకీయ పరమైన విమర్శలు కూడా చేస్తున్నారు. ఈటలపై డైరక్ట్ ఎటాక్‌కు రాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపిని టార్గెట్ చేస్తున్నారు. అలాగే సెంటిమెంట్‌తో ఓటు వేయొద్దని అంటున్నారు.
హరీష్ ప్రలోభాలకు హుజూరాబాద్ ప్రజలు పెద్దగా లోంగేలా కనిపించడం లేదు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నికలో కేంద్రంలో ఉన్న బిజేపిని టార్గెట్ చేయడం వల్ల పావలా ఉపయోగం లేదు. జనాలు సెంట్రల్ పాలిటిక్స్ పెద్దగా పట్టించుకోరు. ఇక ఈటలపై సెంటిమెంట్‌తో ఓటు వేయొద్దని అంటున్నారు. కానీ సెంటిమెంట్ మీద పుట్టిన పార్టీనే టిఆర్‌ఎస్. తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు ఆ సెంటిమెంట్ రాజకీయంగా వాడుకోవడంలో తప్పులేదు. కానీ రాష్ట్రం వచ్చాక కూడా అదే సెంటిమెంట్‌తో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ ఇవేమీ ప్రజలు పట్టించుకునే పరిస్తితిలో లేరు. మొత్తానికైతే మామ కళ్ళలో హరీష్ ఆనందం చూడలేరేమో అనిపిస్తోంది.