మీరు పార్టీకి అవసరం లేదు అంటున్న కేటీఆర్ ..!

-

రాజకీయ పార్టీలకు ఇప్పుడు కావాల్సింది పౌడర్ రాసే వాళ్ళు కాదు. చెమటలు పట్టే వాళ్ళు. చెమటలు పడుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వారు. పార్టీని నిలబెట్టే వారు. పార్టీ కోసం కార్యకర్తలతో కలిసి పని చేసే నాయకులు పార్టీకి కావాలి. వాళ్ళు అయితేనే పార్టీని నిలబెడతారు, బ్రతికిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఏంటో తెలుసా…? హడావుడి బ్యాచ్. పార్టీ కోసం పని చేయకుండా సోషల్ మీడియాలో హడావుడి చేసారు.

ఇప్పుడు తెలంగాణా లో మంత్రి కేటిఆర్ వారిని ఎరేసే పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ ఎన్నికలప్పుడు, నాయకులు వచ్చినప్పుడు జెండా లు పట్టుకుని పులిహోర పోస్ట్ లు పెడుతూ పార్టీని బ్రతికిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్న వాళ్ళను పార్టీ నుంచి తప్పించాలని ఆయన భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి ఇదే కారణం అని కెసిఆర్ కూడా భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే ఉమ్మడి జిల్లాల్లో హడావుడి చేసే నాయకులను పార్టీ నుంచి దూరం పెట్టాలని ఒక జాబితా కూడా సిద్దం చేస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ లకు ఇప్పటికే దీనికి సంబంధించి బాధ్యతలను కూడా అప్పగించారని సమాచారం. ఒక ప్రత్యేక టీం దీనికి సంబంధించిన జాబితాను త్వరలో సిద్దం చేసి కేటిఆర్ కి అప్పగించే అవకాశం ఉందని సమాచారం. నియోజకవర్గాల్లో ఏ మాత్రం పార్టీ కోసం కష్టపడకుండా,

ఎంత సేపు మీడియాలో హడావుడి చేసే నాయకులను కూడా ఇక పార్టీ నుంచి పక్కకు తప్పించే యోచన కేటిఆర్ చేస్తున్నట్టు సమాచారం. వాళ్ళు ఎలాంటి వారు అయినా సరే పార్టీకి అవసరం లేదని కెసిఆర్ ఆదేశాలు ఉండటంతో వచ్చే ఎన్నికలకు సమర్ధవంతమైన నాయకత్వాన్ని క్షేత్ర స్థాయిలో తయారు చెయ్యాలని కెసిఆర్ సూచించారట. దీనితో ఇప్పుడు ఎవరిని అయినా ఎంతటి వారిని అయినా తప్పించడానికి సిద్దమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version