తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి 6వ తరగతి నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించారు. అయితే, అర్హత పరీక్ష రాసేందుకు పలివేల్పుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ పాఠశాల పరీక్ష కేంద్రానికి తండ్రితో వచ్చిన ఓ విద్యార్థి లోనికి వెళ్లనని, నాకు భయం వేస్తోందని మారం చేశాడు.
దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కేయూసి ఇన్‌స్పెక్టర్ రవికుమార్, హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి ఆ విద్యార్థిని బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. సదరు విద్యార్థి పరీక్ష రాసేందుకు పోలీసులు చూపిన చోరవను పలువురు మెచ్చుకుంటున్నారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
లోపలికి పోను… భయమేస్తోందని మారం చేసిన బాలుడు కి ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపిన పోలీస్ లు..
నాకు భయం వేస్తోంది పరీక్ష పోను అని పరీక్షా కేంద్రం వద్ద మారం చేసిన బాలుడిని పోలీసులు బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపిన సంఘటన హన్మకొండ లో జరిగింది..… pic.twitter.com/uhXHMKn93K
— Telangana Awaaz (@telanganaawaaz) February 23, 2025