సిరిసిల్ల లో ఇవాళ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్బంగా సిరిసిల్ల కలెక్టర్ కక్ష సాధింపుతో టీ స్టాల్ కోల్పోయిన బత్తుల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి సొంత ఖర్చులతో మరో టీ స్టాల్ పెట్టిస్తానని మాటిచ్చారు కేటీఆర్.
కాగా, సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ ఉన్న టీ స్టాల్ ను తొలగించడమే కాదు, పూర్తిగా ఆ టీ స్టాల్ ను తొలగించారు సిరిసిల్ల కలెక్టర్. ఇటీవల కేటీఆర్ ఫోటో పేరు ఉన్న కారణంగా టీ స్టాల్ ను మూసివేయించారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ. ట్రేడ్ లైసెన్స్ లేదనే కారణం బూచిగా చూపెట్టి టీ స్టాల్ ను గత రెండు రోజుల క్రితం మూసి వేయించిన కలెక్టర్, తాజాగా టీ స్టాల్ ని తొలగించారు.
https://twitter.com/TeluguScribe/status/1896145483619553310