ఈటల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు మొదటి నుంచి కేసీఆర్ చాలా పక్కాగా ఆలోచిస్తున్నారు. ఈటలపై ఎవరిని పడితే వారిని మాట్లాడనివ్వకుండా చాలా కొద్ది మందికే ఆ బాధ్యత అప్పగించారు. ఈటల రాజేందర్‌కు పార్టీలో ఉన్న సన్నిహితులతోనే వైరం పెట్టి రాజకీయం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే హరీశ్‌రావును రంగంలోకి దింపిన కేసీఆర్.. త్వరలోనే వచ్చే ఉప ఎన్నికలో ఈటలకు ఎవరూ మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు గులాబీ బాస్.
ఇందులో భాగంగా హుజూరాబాద్‌లో మార్కు రాజకీయం మొదలు పెట్టారు కేసీఆర్. నిన్న జరిగిన కేబినెట్ మీటింగులో ముఖ్యంగా హుజూరాబాద్‌మీదనే ఫోకస్ పెట్టారు. ఇందుకు గాను కులానికో మంత్రిని ఇన్‌చార్జిగా నియమించారు. హుజూరాబాద్‌లో ఉన్న అన్ని కులాలను టార్గెట్ చేశారు.
నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఇద్దరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను ఇన్ చార్జులుగా నియమించారు. రెడ్డి, ఓసీ కులాల బాధ్యతను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు అప్పగించారు. అలాగే ఎస్సీల బాధ్యతను ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు, బీసీల బాధ్యతను గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్‌లకు అప్పగించారు. వీరందరూ హరీశ్‌రావు ఆధ్వర్యంలో పనిచేయనున్నారు. అలాగే వినోద్‌కుమార్ కూడా ఇందులో ఉంటారు. ఇలా మండలాల వారీగా అందరికీ టార్గెట్‌లు ఇస్తున్నారు కేసీఆర్?