ఏపీ సీఎం జగన్ కు కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ

-

ఏపీ సీఎం జగన్ కు కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను రాష్ట్రానికి వదిలేసి కేంద్రం చోద్యం చూస్తోందని లేఖ ద్వారా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత కేంద్రం తీసుకునేలా ఒత్తిడి చేయాలని సీఎం ను కోరారు.

పోలవరంపై ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత పోలవరం అథారిటేనని, ఈనెల 29న కేంద్రం సమక్షంలో జరిగే సమావేశంలో గట్టిగా డిమాండ్ చేయాలన్నారు. కేంద్రం తీరు వల్లే పోలవరం ప్రాజెక్టు పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని ఒడిస్సా, చత్తీస్ గడ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు కరకట్టల నిర్మాణానికి ఓడిస్సా, చత్తీస్ గడ్ ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే అని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీదేనని స్పష్టం చేయాల్సిన అవసరాన్ని మీకు తెలియజేయాలని ఈ లేఖ రాస్తున్నాను. ఈ విషయంలో సత్యరమే సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను సీఎం జగన్‌ ను కోరారు కేవీపీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version