భారీ సిక్స్ తో ఇన్నింగ్స్ ముగించిన కృష్ణప్ప గౌతమ్…

-

నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్ కైల్ మేయర్స్ మొదలుకొని ఆఖర్లో వచ్చిన కృష్ణప్ప గౌతమ్ వరకు బంతిని కసిదీరా బాదారు. దాంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (8) ఆరంభంలోనే అవుటైనా, మరో ఓపెనర్ కైల్ మేయర్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. మేయర్స్ కేవలం 38 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు.

అతడి స్కోరులో 2 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. మిడిలార్డర్ లో నికోలాస్ పూరన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు చేశాడు. ఆయుష్ బదోనీ 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు కొట్టగా… ఇన్నింగ్స్ చివరి బంతికి బ్యాటింగ్ కు దిగిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ కృష్ణప్ప గౌతమ్ భారీ సిక్స్ తో ఇన్నింగ్స్ ముగించాడు. టీ20 క్రికెట్ అంటేనే బాదుడుకు మారు పేరు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version