మగచేపలుగా మారుతున్న ఆడచేపలు! ఇదెలా సాధ్యం..?

-

ప్రకృతిలో ఎన్నో విచిత్రాలు. మానవ మేధకు అందని ఎన్నో సైన్స్ సంగతులు. ఇలాంటి విచిత్రాల్లో ఒకటి సుమారు ఐదువందల రకాల చేపలు అవి కావాలనుకున్నప్పుడు ఆడ చేప నుంచి మగచేపగా మారుతున్నాయి. వివరాలు తెలుసుకుందాం… క్లోన్‌ఫిష్ సహా 500కు పైగా రకాల చేపలు కావాలనుకుంటే లింగమార్పు చేసేసుకుంటాయి. అదీ కేవలం పది రోజుల్లోనే ఆడ చేపలు పూర్తిస్థాయి మగ చేపలుగా మారిపోతాయి. ఉన్నట్టుండి ఇదెలా సాధ్యమవుతోంది? దీనికి అసలు కారణమేంటన్నది ఇప్పటివరకూ అంతుచిక్కని రహస్యం. ఇటీవల న్యూజిలాండ్‌లోని ఒటాగో శాస్త్రవేత్తలు ఎట్టకేలకు దీని వెనుకనున్న రహస్యాన్ని కనుగొన్నారు. శాస్త్రవేత్త ఎరికా టాడ్ ఈ వివరాలను వెల్లడించారు.

Lady fish converting themselves into male fish

క్లోన్‌ఫిష్ సహా నీలిరంగు తల ఉండే ఆడ చేపలు… నడివయసుకు వచ్చేసరికి మగవిగా మారిపోతుంటాయి. ఇందుకు చుట్టూ ఉన్న పరిస్థితులే కారణం. తమతో కలిసి సహజీవనం చేసిన బలమైన మగచేప చనిపోయినప్పుడు… ఆడ చేపలు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయి. మగ చేపగా జీవించాలని అనుకున్నదే ఆలస్యం. క్షణాల్లో శరీరంలో మార్పులు ప్రారంభమైపోతాయి. మొదట మగచేపలాంటి ప్రవర్తనను కనబరుస్తాయి. తర్వాత పూర్తిస్థాయిలో జన్యు మార్పులు చోటుచేసుకుంటాయి. గర్భాశయ నిర్వహణ కోసం ఆడ చేపల్లో ఉత్పత్తయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ అరోమాటసీ నిలిచిపోతుంది.

అదే సమయంలో వృషణాలు ఏర్పడి, కేవలం 10 నుంచి 21 రోజుల్లోనే మగ చేపలా మారిపోతాయి. ఆ తర్వాత పది రోజులకే ప్రత్యుత్పత్తికి సిద్ధమైపోతాయి అని ఎరికా వెల్లడించారు. ఇదంతా వాటి జీవన ప్రక్రియలో భాగమని, పరిస్థితులకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకుంటాయని పేర్కొన్నారు. ఆసక్తికరమైన ఈ పరిశోధన వివరాలను సైన్స్ అడ్వాన్సస్ పత్రిక ప్రచురించింది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version