AP: వివాహేత‌ర సంబంధం నేప‌థ్యంలో మహిళా వాలంటీర్‌ హత్య.

-

ఏపీలో రోజూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ఓ పక్క అత్యాచార ఘటనలతో తలనొప్పిగా మారగా.. మరో పక్క హత్యలు నిద్ర పోనివ్వడం లేదు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మరో హత్య చోటు చేసుకుంది. ఈ ఘటన.. ఆంధ్ర ప్రదేశ్‌ లోని బాప‌ట్ల జిల్లాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. జిల్లా ప‌రిధిలోని వేమూరు మండ‌లం చావ‌లి గ్రామంలో వాలంటీర్‌గా ప‌నిచేస్తున్న శార‌ద అనే మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది.

గ్రామానికి చెందిన ప‌ద్మారావు అనే వ్య‌క్తి ఆమెను హ‌త్య చేశాడు. దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన గ్రామానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. వివాహేత‌ర సంబంధం నేప‌థ్యంలో త‌లెత్తిన గొడ‌వ కార‌ణంగానే శార‌ద‌ను ప‌ద్మారావు హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version