మనదేశంలో కొన్ని మిస్టీరియస్ ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి విన్నప్పుడల్లా అరే మనం కూడా లైఫ్ లో ఏదో ఒకరోజు అక్కడికి వెళ్లాలి అనుకుంటాం. చాలామందికి క్రేజీగా, ఎవ్వరూ చేయనిదే చేయటం అంటే ఇష్టం ఉంటుంది. అలాంటి మిస్టీరియస్ ప్రదేశాలలో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే.. లేక్ ఆఫ్ నో రిటన్. ఇదేంటి పేరు వెరైటీగా ఉంది అనుకుంటున్నారా.. అవును మరీ..ఆ లేక్ కి వెళ్లటమే కానీ తిరిగి రావటం ఉండదట. ఇదేదో సినిమా కథో.. లేక చిన్నప్పుడు బామ్మలు చెప్పే కథలో ఉండే లేక్ కాదు..నిజమైన సరస్సే..ఇందులో అన్నీ సీక్రెట్స్ హే..
ఎక్కడుందంటే..
మనదేశానికి, మయన్మార్‌కు మధ్య సరిహద్దు ప్రాంతంలో అంటే అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లాలో నవాంగ్ యాంగ్ అనే సరస్సు ఉంది. దీనిని అందరూ మిస్టీరియస్ లేక్ అని పిలుస్తుంటారు..అనేక సంఘటనల ఆధారంగా దానికాపేరు వచ్చింది.
ప్రచారంలో ఉన్న కొన్ని కథనాలు ఏంటంటే..రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపనీస్ సైనికులతో ఉన్న ఒక విమానం ఈ ప్రదేశంలో దారితప్పి అత్యవసర ల్యాండ్ అయ్యిందట. చాలా అనూహ్య రీతిలో విమానంతో సహా అందరూ అదృశ్యమయ్యారు. ఒక అధ్యయనం ప్రకారం యుద్ధం ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తున్న జపాన్ సైనికులందరూ మలేరియా కారణంగానే మరణించి ఉంటారని చెబుతున్నారు.
ఐతే ఈ సరస్సు చుట్టుపక్కల గ్రామస్తుల్లో మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే..ఒక అతనికి ఈ సరస్సులో ఓ పెద్ద చేప దొరికిందని… దీంతో అతను ఆ గ్రామంలోని అందరికీ విందు ఏర్పాటు చేశాడు. కానీ ఓ వృద్ధురాలు, ఆమె మనవరాలిని మాత్రం అతను విందుకు ఆహ్వానించలేదట..సరస్సుకు కాపలా కాస్తున్న వ్యక్తి కోపంతో వారిద్దరినీ ఊరు విడిచి వెళ్లమని ఆజ్ఞాపించాడు. కానీ ఆ మరుసటి రోజే ఊరంతా సరస్సులో మునిగిపోయిందట. అక్కడి గ్రామస్తుల్లో ఈ విధమైన జానపద కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. ఈ మిస్టీరియస్ సరస్సు రహస్యాన్ని ఛేదించడానికి ఇప్పటివరకు చాలా ప్రయత్నాలు చేశారు..కానీ అవేవి ఫలించలేదు.
ఈ విధంగా అనేక పురాణాలు, కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ మరికొందరు అయితే.. అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యాటకాన్ని పెంచాలనే ఆశతో అక్కడి గ్రామస్తులు ఈ స్థానిక బెర్ముడా ట్రయాంగిల్‌పై రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నారనే నానుడి కూడా ఉంది. ఏది ఏమైనప్పటికి ఈ లేక్ ఒక మిస్టీరీ గానే మిగిలిపోయింది.
– Triveni Buskarowthu