భారత్​ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్​లో అదరగొట్టిన లక్ష్యసేన్‌

-

కామన్వెల్త్‌ క్రీడల్లో భాగంగా చివరి రోజు ఆటలో భారత్​ ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 19- 21, 21-9, 21-16 తేడాతో మలేషియాకు చెందిన జె యంగ్‌ను ఓడించి గోల్డ్ మెడల్ సాధించాడు. కామన్వెల్త్‌లో భారత్‌కు ఇది 20వ స్వర్ణ పతకం. తొలి గేమ్‌లో కాస్త వెనుకంజలో నిలిచిన లక్ష్యసేన్‌ చివరి రెండు గేమ్స్‌లోనూ పట్టుదలగా ఆడాడు. ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చినా ఎక్కడా విశ్వాసం కోల్పోలేదు. పట్టుదలగా ఆడి భారత్‌కు మరో పసిడి అందించాడు.

అంతకుముందు ఈ క్రీడల్లో కాసేపటి కింద భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు కూడా స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది.

దీంతో వరుస గేమ్స్‌లో ఆధిపత్యం చెలాయించి భారత్‌కు మరో పసిడి అందించింది. కాగా, కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది. మొత్తంగా ఈ రెండు విజయాలతో ఈ కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మొత్తం 57 పతకాలు సాధించింది. అందులో 20 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version