కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. ఇటు భారీ వర్షాలు నగరాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన సంఘటనలో ఏకంగా 36 మంది దుర్మణం చెందారు. రాయ్ గఢ్ జిల్లా మహద్‌తలై లో మూడు చోట్ల భారీ ఎత్తున కొండచరియలు విరిగి పడ్డాయి.
ఘటనా స్థలిలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద 30 మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. 47 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయి – గోవా హైవేపై కిలో మీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ఇది ఇలా ఉండగా… మహారాష్ట్ర రాష్ట్రంలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా… తెలంగాణ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి.