లసిత్ మలింగ ప్రశంసలు: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన యంగ్ బౌలర్ పతిరణ !

-

గత రాత్రి జరిగిన చెన్నై మరియు బెంగుళూరు మ్యాచ్ లో చెన్నై నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యానికి అతి దగ్గరగా వచ్చి డుప్లెసిస్ సేన చేతులెత్తేసింది. ఒక దశలో అయితే బెంగుళూరు కొన్ని బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సునాయాసంగా చేదిస్తుంది అని అంతా డిసైడ్ అయిపోయారు. కానీ వరుసగా మాక్స్ వెల్ మరియు డుప్లెసిస్ లు అవుట్ అవ్వడంతో ఆశలు వదిలేసుకుంది. అయినా దినేష్ కార్తీక్ దూకుడుగా ఆడి గెలుపుకు దగ్గర చేసినా ఆఖరి ఓవర్ లో 19 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులో సుయాశ్ ప్రభుదేశాయ్ మరియు హాసరంగాలు ఉన్నా కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఓటమిని కొనితెచ్చుకున్నారు.

ఈ ఓవర్ ను వేసింది ఐపీఎల్ మొదటి సీజన్ మొదటి మ్యాచ్ ను ఆడుతున్న శ్రీలంక యంగ్ బౌలర్ మతీశ పతిరణ.. చాలా ఓపికగా ఎటువంటి తొందర పడకుండా బౌలింగ్ చేసి మ్యాచ్ ను గెలిపించాడు. పతిరణపై శ్రీలంక మాజీ బౌలర్ మలింగ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆఖరి ఓవర్ లో ఎంతో ఒత్తిడిని తట్టుకుని బౌలింగ్ చేసిన విధానం ఆకట్టుకుంది అంటూ ట్వీట్ చేశాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version