మరొక సరికొత్త ఎమర్జెన్సీ దిశగా దేశం ?

-

ఇండియాలో కరోనా వైరస్ రోజురోజుకి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఒక్కరోజులోనే ఇటీవల 99 కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో భయాందోళన నెలకొంది. దీంతో ఇప్పుడు దేశం మొత్తం దాదాపుగా లాక్ డౌన్ అయ్యింది. ప్రభుత్వాలు నాయకులు ఎన్ని జాగ్రత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నా చాలా చోట్ల జనాలు రోడ్డుమీదికి వస్తూ ఇష్టానుసారంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు చాలాచోట్ల. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.దీంతో ఇప్పుడు దేశం మొత్తం అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మహా నగరాలు మరియు పట్టణాలు గ్రామాలు అంతా సైలెంట్ అయిపోయాయి. రోడ్ల మీద వాహనాలు జరగకపోవడంతో కాలుష్యం చాలావరకూ కంట్రోల్ అయినట్టు తెలుస్తోంది. అంతా బాగానే ఉన్నా గాని ఆర్థిక రంగం కుదేలైంది. కరోనా కారణంగా ఒకవైపు ఆర్థికమాంద్యం మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా నష్టాల పాలు కావడంతో..తాజాగా మరో ఒక సరికొత్త ఎమర్జెన్సీ ప్రకటించడానికి ఇండియా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆర్థిక మాంద్యాన్ని కట్టడి చేయటానికి భారత ప్రభుత్వం ఆర్టికల్ 360 ప్రకారం ఆర్ధిక ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఇదే జరిగితే దేశం కొన్నాళ్లపాటు ఆర్ధికంగా మరింతగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రజలు దీనికి సిద్ధంకాకా తప్పదని నిపుణులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. అటు అమెరికా సైతం ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మొత్తం మీద ఇటు వంటి ప్రమాదకరమైన వైరస్ పెట్టాలంటే కఠినమైన నిబంధనలు పాటించడం తప్పదని అంటున్నారు నిపుణులు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version