సీఎం కేసీఆర్ కు 2 కోట్లు విరాళం ఇచ్చిన సత్యా నాదెళ్ళ భార్య…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి గాను ఇప్పటికే ఐటి కంపెనీలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూస్తున్నాయి కంపెనీలు అన్నీ కూడా. తమ ఉద్యోగుల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని భావించి అందరిని వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వహించాలని సూచించారు. ఎక్కడా కూడా వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఇది పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వానికి పలు ఐటి కంపెనీలు తమ విరాళాలను ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణా రాజధాని హైదరాబాద్ ఇండియా సిలికాన్ వ్యాలీగా ఉంది. ఎన్నో ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడి నుంచి సేవలు అందిస్తున్నాయి. ఐటి ఉత్పత్తులలో తెలంగాణా అగ్రగామి గా ఉంది దేశంలో. దీనితో ఇప్పుడు తెలంగాణా కోలుకోవాలని కోరుకుంటున్నాయి కంపెనీలు అన్నీ కూడా.

ఈ నేపధ్యంలోనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ భార్య తెలంగాణా ప్రభుత్వానికి రెండు కోట్ల విరాళం ఇచ్చారు. కెసిఆర్ ని కలిసి ఈ చెక్ ని అందించారు ఆమె. అలాగే మరికొని ప్రముఖ కంపెనీలు కూడా ఈ బాట లోనే నడిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే టీసీఎస్ కూడా తమ వంతు విరాళం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. గూగుల్ కూడా సంస్థ తరుపున విరాళాలు ప్రకటించాలని భావిస్తుంది. ఉద్యోగులు కూడా ముందుకి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version