సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న అనుమానాస్పద మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అతనిది ఆత్మ హత్య కాదని హత్యేని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. బాలీవుడ్‌లో వున్న నెపోటిజమ్ కారణంగానే సుశాంత్ మృతి చెందాడని నెటిజన్స్ బాలీవుడ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్రం సుశాంత్ మృతి వెనక ఏం జరిగిందో బయటికి రావాలని ఈ కేసుని ముంబై పోలీసుల నుంచి సీబీఐకి అప్పగించింది. అక్కడి నుంచి సుశాంత్ కేసులో థ్రిల్లర్‌ని తలపించే స్థాయిలో ట్విస్ట్‌లు, టర్నలు రోజు రోజుకీ బయటికి వస్తూనే వున్నాయి.
రియాకు డ్రగ్స్‌కు సంబంధం వుందని తేలడంతో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తూ వచ్చింది. అయితే రియా పలువురు బాలీవుడ్ హీరోయిన్‌ల పేర్లని కూడా డ్రగ్స్‌లోకి లాగడంతో కథ మరో మలుపు తీసుకుంది. ఇదిలా వుంటే తాజాగా ఏయిమ్స్ వైద్యులు సుశాంత్ ఆత్మ హత్యకు పాల్పడ్డాడని, అతన్ని ఎవరూ హత్య చేయలేదని సీబీఐకి రిపోర్ట్‌ని అందించడం తెలిసింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేపథ్యంలో రిపబ్లిక్ టీవి ఛీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
సుశాంత్ అనుమానాస్పద మృతి పై అసలు నిజాన్ని రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు బ్లాస్ట్ చేయబోతున్నానని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని ఎవరు మర్డర్ చేశారో చెప్పబోతున్నానని వెల్లడించడం సంచలనంగా మారింది. సుశాంత్ మర్డర్ వెనకున్న కీలక టేపులతో పాటు పలు కాల్ రికార్డ్‌లని కూడా అర్నబ్ సోమవారం బయటపెట్టబోతున్నాడట. ఫోరెన్సిక్ ఛీఫ్ సుధీర్ గుప్తా రిపోర్ట్‌ని ఉటంకిస్తూ సంచలన ప్రకటన చేయబోతున్నాను. సుశాంత్ ది ఓ సాధారణ ఆత్మ హత్య ఏయిమ్స్ డాక్టర్ల బృందం తేల్చింది. అయితే ఏయిమ్స్ ఇలా ఎందుకు చెప్పిందని, నిజాలని ఎందుకు దాస్తోందని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటి దారని సుశాంత్ అభిమానులు అంటున్నారు. వారందరి తరుపున సోమవారం నేను నిలబడబోతున్నాను. సుశాంత్‌ది ఆత్మ హత్యే అయితే ఏయిమ్స్ ఛీఫ్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? ఆయన అబద్ధపు నివేదికని ఇవ్వమని ఆయనని ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా? చేశారా? అన్నది రేపు తేల బోతోంది అన్నారు అర్నబ్.
మరిన్ని విషయాల్ని కూడా వెల్లడించారు. ఈ కేసు గురించి నాకు చాలా కాల్స్ వచ్చాయి. అందుకే దీనిపై మళ్లీ లోతుగా మ టీమ్ వర్క్ చేసింది. రిపబ్లిక్ టీవీ వీక్షకులందరికీ నేను బలంగా చెప్పగలను. దయచేసి నిరాశ చెందకండి. మేము తుది వాస్తవం. రికార్డింగ్‌లు, టేపులను బయట పెట్టబోతున్నాము. ఈ దశలో నేను ఎక్కువ చెప్పలేను ఎందుకంటే మా శత్రువులు ఎవరో నాకు తెలుసు. కానీ మేము ఈ విషయంలో తుది రుజువును ఉంచబోతున్నాము. అది సోమవారం ఉదయం 10 గంటలకు ఉంటుంది, అంటే రేపు. కాబట్టి ఇది మా మద్దతుదారులు మరియు వీక్షకులందరికీ తెలుస్తుంది కాబట్టి అంతా నిరుత్సాహపడకండి.
`మేము ఏకకాలంలో తుది వాస్తవాన్ని బయట పెట్టబోతున్నాము. అంతకు మించి ప్రశ్నించడం సాధ్యం కాదు. కొంతమంది ఏ కారణం చేతనైనా ఈ కథనాన్ని నిలిపివేయించడానికి ప్రయత్నించ వచ్చు. సుశాంత్ మృతిని ఆత్మ హత్యగా చిత్రిస్తున్నారు. అలా అంటున్న వారిని నేను వారిని సవాలు చేస్తున్నాను. నేను ఈ రోజు వారికి ధైర్యంగా చెబుతున్నాను వారు ఈ విషయంలో గెలవలేరు. వాస్తవాలు బయటపడిన తరువాత దేశ ప్రజలంతా వారిపై ఉమ్మివేయడం ఖాయం` అని అర్నబ్ గోస్వామి తన అధికారిక రిపబ్లిక్ టీవి సైట్‌లో వెల్లడించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకీ అర్నబ్ మండే ఏం చెప్పబోతున్నాడు? సుశాంత్ ది హత్యేనని బలంగా ధైర్యంగా ఎలా చెబుతున్నాడు? .. అతని వద్ద వున్న కీలక ఆధారాలేంటి? అన్నది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.