తెలంగాణ రాష్ట్రంలో వాహన చార్జింగ్ కేంద్రం ప్రారంభం అయింది. రెడ్కో- ప్రైవేటు భాగస్వామ్యంతో దేశంలోనే మొదటి వాహన చార్జింగ్ కేంద్రం ప్రారంభం అయింది. ఈ మొదటి వాహన చార్జింగ్ కేంద్రాన్ని యాదగిరిగుట్టలో ప్రారంభించారు రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
పర్యావరణ పరిరక్షణకు ప్రజలు కృషి చేయాలని నేపథ్యంలోనే వీటిని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ రోజు దేశంలోనే PPP మోడల్ లో మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రం నేడు యాదాద్రిలో ప్రారంభించడం జరిగిందని…రెడ్కో- ప్రైవేటు భాగస్వామ్యంతో మొదటి ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రం ప్రారంభం చేశామని తెలిపారు రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి.