కేసీఆర్ మనువడు కూడా ఎమ్మెల్యే అయ్యేటోడు..కానీ బతికి పోయాం – లక్ష్మణ్‌

-

కేసీఆర్ మనువడు కూడా ఎమ్మెల్యే అయ్యేటోడు..కానీ బతికి పోయాం అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మనవడికి వయసు లేక బతికిపోయాం లేకపోతే బుడ్డోడు కూడా ఎమ్మెల్యే అయ్యేటోడన్నారు. రాజకీయంగా వెనుకబడిన కులాలకు మోడీ అండగా నిలుస్తున్నారని… చిన్న కులాలు చిన్న రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారని మోడీపై ప్రశంసలు కురిపించారు.

ఓబీసీ లకు నీట్ లో కూడా రిజర్వేషన్ ఇచ్చింది మోడీ.. నవోదయ, సైనిక్ స్కూల్ లో ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చింది మోడీ అన్నారు. Ktr మీది నాలుగు కోట్ల కుటుంబమా, నలుగురు కుటుంబం నాలుగు కోట్ల మీద పెత్తనం చేసే కుటుంబమా తెలుసు అని ఫైర్‌ అయ్యారు. మోడీ, యోగి కుటుంబాల ను చూడండి వాళ్ళ స్థితి చూడండని… ఘర్ ఘర్ చలో గావ్ గావ్ చలో  ద్వారా తెలంగాణ లో ఓబీసీ మోర్చా లక్ష కుటుంబాలాను కలుస్తుందని వివరించారు.

ఏప్రిల్ 6 నుంచి 14 వరకు బీసీ ల కోసం మోడీ సర్కారు చేసే  కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందేనని… 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన ఘనత మోడీ గారిదేనని వెల్లడించారు. ఉప్పు, పప్పు, నూనె, చింతపండు కూడా కలిపి యోగి ఇస్తున్నాడు… మోడీ మూడున్నర కోట్ల ఇండ్లు కట్టించి ఇచ్చాడన్నారు. 50 యేండ్లు నెహ్రు కుటుంబం ఓబీసీ లను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకున్నది…. “పల్లె పల్లె కు ఓబీసీ – ఇంటింటికి బీజేపీ” ఇదే నినాదం అని లక్ష్మణ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version