పోసాని భార్యను అనడం ఏంటి ? : పవన్ కు చుక్కలు చూపించిన లక్ష్మి పార్వతి !

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై పోసాని కృష్ణ మురళి నిన్న సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. పోసాని పై పవన్‌ అభిమానులు మండిపడుతున్నారు. అయితే… తాజాగా తెలుగు, సంస్కృతి అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి.. పోసానికి అండగా నిలిచారు. పోసాని మురళి భార్య కు జరిగిన అవమానం చూశాక మాట్లాడకుండా వుండటం మానవత్వం కాదన్నారు.

మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే స్థాయికి తెలుగుదేశాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. అతని రాజకీయాలకు వారసత్వాన్ని లోకేష్, పవన్ సాగిస్తున్నారని… పవన్ కళ్యాణ్ విలువలకు తిలోదకాలు ఇచ్చారని నిప్పులు చెరిగారు. ఎప్పుడూ బయటకే రాని పోసాని భార్య ను కూడా అవమానించడం అంటే ఏ స్థితికి పవన్ కల్యాణ్ దిగజారాడో అర్థం అవుతుందని ఫైర్‌ అయ్యారు లక్ష్మీ పార్వతి. ఓ రాజకీయ పార్టీ నేత అయి ఉండి… ఇలా దిగజారడం దారుణమన్నారు లక్ష్మీ పార్వతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version