గులాబ్ తుఫాను రాష్ట్రాలకు రాష్ట్రాలను కలవరపరుస్తోంది. మొన్న ఏపీలో దంచికొట్టిన వానలు, నిన్న తెలంగాణను కలవరపెట్టాయి. గులాబ్ ప్రభావంతో మహారాష్ట్రలో కూడా విపరీతంగా వానలు కురిశాయి. ఈశాన్య దిశగా కదిలిన గులాబ్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో గులాబ్ ధాటికి వర్షాలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర, కఛ్ రీజియన్లలో ఎడతెరిపి లేకుండా వానలు పడే అవకాశం ఉంది. గుజరాత్ లోని పలు జిల్లాల్లో వర్షాల కారణంగా ఊళ్లలోకి నీరు చేరుతోంది. అల్పపీడన ప్రభావంతో గుజరాత్ అంతటా వర్షాలు కురుస్తాయిన వాతావరణ కేంద్రం హెచ్చిరిస్తోంది. దీంతో పాటు అరేబియన్ సముద్రంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడటంతో మరింత వానలు పెరిగే అవకాశం ఉంది. రాగల మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సహయకచర్యలు తీసుకోనున్నారు.