పొలిటికల్ థ్రిల్లర్ గా లీడర్ 2..?

-

రానా దగ్గుబాటి హీరోగా వచ్చిన లీడర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది దగ్గుబాటి రానా డెబ్యూ ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని డిమాండ్ అభిమానుల్లో ఎప్పటినుండో కూడా ఉంది అయితే ఆ రేంజ్ కథ దొరకపోవడంతో ఇంతకాలం కూడా ఈ సినిమాని చేయలేదు. తాజాగాఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. లీడర్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రానా తొలి ప్రయత్నంలోనే నటుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇస్తూ లీడర్ వంటి సబ్జెక్ట్ ని ఎంచుకున్నారు రానా.

విమర్శకుల నుండి కూడా ప్రశంసలని పొందారు. లీడర్ సూపర్ హిట్ అవడంతో ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని మూవీ మేకర్స్ భావించారు అప్పట్లో సీక్వెల్స్ ట్రెండ్ అంతగా లేదు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది ఈ మూవీ మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత జరిగిన పరిణామాలు నేపథ్యంలో ఈ కథని తీసుకురావాలని అనుకుంటున్నారు. ధనుష్ మూవీ పనుల్లో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారు ఈ సినిమా పూర్తయ్యాక లీడర్ టు మీద పూర్తి ఫోకస్ పెడతారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version