ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా విశాఖ సీపీ రవిశంకర్ మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. MRO నీ హత్య చేసిన నిందితుడిని గుర్తించాం అని సీపీ రవిశంకర్ తెలిపారు. నిందితుడికి సంబంధించిన విషయాలను అన్నింటినీ మీడియాకి చెబితే నిందితుడు పారిపోయే అవకాశముందని సీపీ వెల్లడించారు.
నిందితుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. అయితే అతను కొన్న ప్లాట్ కు ఈఎంఐ కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు ప్లాట్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చాలా సార్లు ఎమ్మార్వో రమణయ్య ఆఫీస్ వద్దకు వెళ్లాడు. రియల్ ఎస్టేట్ గొడవలు, భూమికి సంబంధించిన వివాదాలే ఈ హత్య కారణమని సీపీ వెల్లడించారు. అయితే నిందితుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న ఆధారాలు గుర్తించారు పోలీసులు. నిందితుడి అడ్రస్, బ్యాంకు వివరాలను కూడా స్వాధీనం చేసుకున్నామని.. నిందితుడి కోసం పది బృందాలతో గాలింపు చేపడుతున్నట్టు తెలిపారు సీపీ రవిశంకర్.