మహిళపై చిరుతపులి దాడి.. ఎక్కడంటే?

-

ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పులి పంజా విసిరింది. జిల్లాలోని బజార్హాత్నూర్ మండలంలో ఓ మహిళపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో మహిళ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌‌కు తరలించారు.


మహిళపై చిరుతపులి దాడి చేయగా ఆమె గట్టిగా వేసినట్లు తెలిసింది. దీంతో స్థానికులు పరిగెత్తుకుని రావడంతో చిరుతపులి భయంతో పారిపోయినట్లు సమాచారం. చిరుతపులి దాడితో గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే చిరుతపులిని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఇదిలాఉండగా, ఒంటరిగా బయట తిరగొద్దని, వెళ్లినా కర్ర తీసుకుని వెళ్లాలని అధికారులు గ్రామస్తులను హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version