టిడిపి నేతల నాలుక కోస్తాం – వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

-

టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబం పై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ భారతి గురించి ఏమైనా మాట్లాడితే టిడిపి నేతలు నాలుక కోస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫ్యామిలినే తాగుబోతు కుటుంబం అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఆయన నారా చంద్రబాబు కాదు.. సారా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. నారా లోకేష్ కి మందు, మగువా లేనిదే నిద్ర పట్టదని సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు పైకి చేసేది పాల వ్యాపారం అని.. కానీ తెరవెనక నడిపేది సారా పరిశ్రమ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, వారి కోడలు బ్రాహ్మానికి మద్యం ద్వారా రోజుకు కోటి రూపాయల ఆదాయం వస్తుందని ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కాం వెనుక భువనేశ్వరి ది కీలక పాత్ర ఉందన్నారు. దేశంలో బెస్ట్ సీఎం గా భారత్ లో మూడో స్థానంలొ సీఎం జగన్ ఉన్నారని.. జగన్ పై పనిగట్టుకుని దృశప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version