లైఫ్ ఇన్స్‌రెన్స్ కార్పొరేషన్‌లో అన్నో రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కరోనా తర్వాత నుంచి ఇన్సూరెన్స్ చేసుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతోంది..ఎప్పుడూ ఉంటామో,ఎప్పుడూ పోతామో తెలియదు..అందుకే చాలా మంది ఆరొగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాలసిలు, బీమా పాలసీలు చేసుకుంటున్నారు. అందుకు తగినట్లుగానే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వివిధ బీమా సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం వచ్చేలా పాలసీలను రూపొందిస్తున్నాయి.
దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి పాలసీలు అందిస్తోంది.ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన పాలసీల్లో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ కూడా ఒకటి..ఈ పాలసీలో ప్రతి నెల రూ.233 డిపాజిట్ చేయడం ద్వారా మొత్తం రూ.17 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ లాభం, రక్షణ రెండింటిని అందిస్తోంది. ఈ పాలసీ తీసుకోవాలంటే 8 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారు తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 16 నుంచి 25 ఏళ్లు ఉంటుంది..
ఇకపోతే రోజుకు రూ.233 ఆదా చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.17 లక్షలకు పైగా వస్తాయి. పూర్తి వివరాలకు సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చు..ఈ పాలసిని తీసుకున్న వినియోగదారుడు మూడు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లింపుపై కూడా రుణ సదుపాయం పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తం, బోనస్ వంటివి పొందవచ్చు. ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. పాలసీదారుడి మరణంపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు.
పాలసీ కొనసాగుతున్న సమయంలో గానీ, ఒక వేళ ప్రీమియంలు పూర్తిగా చెల్లించిన తర్వాత పాలసీదారుడు మరణించినా అతని నామినీ డెత్ సమ్ అస్యూర్డ్, సింపుల్ రివర్షనరీ బోనష్, డెత్ బెనిఫిట్స్ అదనంగా బోనస్ అందుకుంటారు.ఈ పాలసి తీసుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల పాలసి దారుడు చనిపోతే అతనికి అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయని అంటున్నారు.
ఈ పాలసి కోసం అవసరమైన పత్రాలు..
మీ చిరునామాను ధృవీకరించే పత్రాలు. సరిగ్గా పూరించిన దరఖాస్తు ఫారమ్. KYC సంబంధిత పత్రాలు. ఉదాహరణకు, పాన్, ఆధార్, ఆదాయపు పన్ను రిటర్న్‌లకు సంబంధించిన సమాచారం.. అవసరమైతే వైద్య పరీక్ష..వయస్సు ధృవీకరణ పత్రం. ఆరోగ్యానికి సంబంధించిన పత్రాలు కావలెను..