మీరు ఎల్‌ఐసీ నుంచి ఏదైనా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే ఈ అదిరిపోయే పాలసీ గురించి ఇప్పుడే చూసేయండి. దీనితో మీకు మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. ఇప్పుడు సూపర్ ప్లాన్ ఒకటి అందుబాటు లోకి వచ్చింది. ఇక దీని వివరాల లోకి వెళితే.. దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC తీసుకొచ్చిన ఈ ప్లాన్ కోసం చూస్తే… ఈ ప్లాన్ పేరు జీవన్ అక్షయ్ పాలసీ.
ఇది ఇలా ఉండగా నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఇలా మీకు నచ్చిన ఆప్షన్ కింద పెన్షన్ పొందొచ్చు. పాలసీదారుడికి 10 రకాల పెన్షన్ ఆప్షన్లు అందుబాటు లో ఉంటాయి. ఈ పాలసీలో కనుక రూ.8 లక్షలు పెడితే మూడు నెలల తర్వాత ప్రతి నెలా రూ.4,600 పెన్షన్ వస్తుంది. ఇలా మీరు ప్రతీ నెల పెన్షన్ ని తీసుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటే దీనిలో ఇన్వెస్ట్ చేయడం వలన ప్రతీ నెల డబ్బులు పొందొచ్చు. పైగా ఏ ఆర్ధిక సమస్య కూడా మీకు కలగదు.